హీరోయిన్లకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే.. ఆ లిస్ట్ పేజీలు పేజీలు ఉంటుంది. హీరోయిన్లే కాదు.. వాళ్ల మమ్మీలు కూడా నా అల్లుడు ఇలా అయితే బాగుంటుందని అంటుంటారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మదర్ తనకు కాబోయే అల్లుడు ఇలా ఉండాలంటూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Pooja Hegde:హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల ఆఫర్లను పట్టేస్తోంది పూజా హెగ్డే (Pooja Hegde). సౌత్‌లో బీస్ట్, రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు అమ్మడికి హ్యాట్రిక్ ఫ్లాపులను ఇచ్చింది. ఇక హిందీలొ సర్కస్, రీసెంట్గా వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలు కూడా పూజను నిలబెట్టలేకపోయాయి. జస్ట్ ఫ్లాప్స్ మాత్రమే కాదు.. పూజా నటిస్తున్న పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అయినా కూడా బుట్టబొమ్మ తగ్గేదేలే అంటోంది.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబీ 28లో పూజా హెగ్గే (Pooja Hegde) నటిస్తోంది. ఈ సినిమా పైనే పూజా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. పూజా పనైపోయినట్టే. అమ్మడు పెళ్లి చేసుకోని ఇంటికి పరిమితం కావాల్సిందే. అందుకేనేమో.. పూజా (Pooja)వాళ్ల మదర్ పెళ్లి పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఒక టాక్ షో కార్యక్రమానికి హాజరైంది. ప్రస్తుతానికి తాను ప్రేమలో లేనని.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదని చెప్పింది పూజా. కానీ పూజా హెగ్డేకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అనే విషయంలో ఆమె తల్లి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూజా (Pooja) చాలా సెన్సిబుల్.. తన జీవితంలోకి వచ్చే వ్యక్తి.. తనను ప్రతి విషయంలోను అర్థం చేసుకునే వ్యక్తి అయ్యి ఉండాలి. మామూలుగా పూజ (Pooja) ప్రతి విషయంలో చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇక పెళ్లి అంటే.. ఒకరి నిర్ణయాలను అభిరుచులను గౌరవించుకోవాలి. అవతలి వ్యక్తికి గౌరవం ఇవ్వని వారితో కలిసి జీవితం సాగించడం చాలా కష్టం. అందుకే అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అయితే పూజాకు బాగుంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనకు కాబోయే భర్త.. ఆమె కెరీర్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు.. తన మనసుకు నచ్చిన విధంగా గౌరవించాలని లత అన్నారు. మొత్తంగా పూజకు ఎలాంటి హస్బెండ్ కావాలో.. వాళ్ల అమ్మకు ఒక ఐడియా ఉందనే చెప్పాలి.