క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) చిత్రాలు అంతా ఈజీగా అర్థం కావు. కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఓపెన్‌హైమర్(oppenheimer) అనే మరో మూవీతో మనముందుకు రాబోతున్నారు.
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ & మీడియా ఔట్‌లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...
మంచి బ్యాగ్రౌండ్‌తో గ్రాండ్‌గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అయినా.. ఆ తర్వాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు శ్రీనివాస్. రీసెంట్‌గా 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. దాంతో మళ్లీ టాలీవుడ్‌లోనే ట్రై చేస్తన్నాడు బెల్లంకొండ బాబు.
ప్రస్తుతం బేబీ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది బేబీ సినిమా. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ రేంజ్ సినిమాల్లో.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బేబీ. దీంతో ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు బిగ్ బ్రేక్ ఇచ్చింది బేబీ. అలాగే.. మరో కీ రోల్ ప్లే చేసిన విరాజ్ అశ్విన్ గురించి అందరికీ తెలిసేలా చేసింది బేబి. అతని గురించి తెలిస్తే నోరెళ్...
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే నాలుగైదు కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దేవర. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు తారక్. బాలీవుడ్ హల్క్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్2 మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే.. ఈ సినిమా షూటింగ్‌లో యంగ్ టైగర్ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
యాంకర్ ఓంకార్(Omkar) తమ్ముడు అశ్విన్ బాబు(Aswin Babu) మరో వైవిధ్యభరిత కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా ‘హిడింబ’ సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్ వారు భారతీయులపై జరిపిన సంఘటనల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది.
బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ప్రియా ప్రకాష్ వారియర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకీ లేట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. దాంతో ఈ మూవీ సైలెంట్ అయిపోయింది. కానీ తాజాగా ఈ సినిమా హీరోయిన్ మాత్రం ఓ అప్డేట్ ఇచ్చింది.
వైవిధ్యభరిత కథాంశాలతో తమిళ హీరో విజయ్ ఆంటోని సినిమా చేసుకుంటూ పోతున్నాడు. గతంలో ఆయన నటించిన బిచ్చగాడు, బిచ్చగాడు2 వంటివి మంచి హిట్స్‌గా నిలిచాయి. తాజాగా ఆయన హత్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలకు ఆదరణ కరువవుతోంది. సరైన పబ్లిసిటీ ఉండటం లేదు. భోళాశంకర్, జైలర్ సినిమాలపై సరైన బజ్ క్రియేట్ కాలేదు.
గతంలో అలియా, రణ్‌బీర్ తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె 'ఎమర్జెన్సీ' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.