ఉన్నట్టుండి దేవర రెండు భాగాలుగా వస్తుందని అనౌన్స్ చేశాడు దర్శకు కొరటాల శివ. దాంతో ఎన్టీఆర్ సెట్ చేసుకున్న లైనప్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు.. వస్తున్నాం, బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘దేవర’ పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా దేవర రిలీజ్ కానుంది. కానీ ఒక్కసారిగా కొరటాల శివ ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి షాక్ ఇచ్చాడు. దేవర చాలా పెద్ద సినిమా, పెద్ద కథ అని.. అందుకే దేవర2 చేస్తున్నామని చెప్పాడు. దీంతో ఇప్పటికే ఎన్టీఆర్ సెట్ చేసుకున్న లైనప్ పరిస్థితేంటి? అనేది అర్థం కాకుండా పోయింది.
ఎందుకంటే దేవర తర్వాత వార్2, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు దేవర సీక్వెల్ అనగానే అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని ఎప్పుడో చెప్పాడు ప్రశాంత్ నీల్. కానీ దేవర2 అనౌన్స్తో డిలే అయ్యే ఛాన్స్ ఉందనుకున్నారు. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
నెలలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ కానుందని చెప్పడంతో.. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ దేవర 2 ఎప్పుడు? అనే డౌట్స్ వస్తున్నాయి. ఒకవేళ పార్ట్ వన్ సమయంలోనే రెండు భాగాల షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అదే జరిగితే వార్2 షూటింగ్ ఎప్పుడనే డౌట్ రైజ్ అవుతోంది. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మాత్రం ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లడం పక్కా.