»Nani Shares His Disappointment Reasons About The National Awards
Nani: నేషనల్ అవార్డ్స్ ఇష్యూ..మరోసారి స్పందించిన నాని
కొంతకాలం క్రితం నేషనల్ అవార్డ్స్(national awards 2023) ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అలియా భట్, కృతిసనన్ లాంటివారికి అవార్డులు వచ్చాయి. చాలా సినిమాలకు కూడా అవార్డులు లభించాయి. ఆ సమయంలో నాని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని సినిమాలకు రానందుకు ఆయన చేసిన కామెంట్స్ పై చాలా మంది ట్రోల్ కూడా చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై ఆయన మరోసారి స్పందించారు.
Nani shares his disappointment reasons about the National Awards
హాయ్ నాన్న(hai nanna) మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నాని మరోసారి జాతీయ అవార్డుల(national awards 2023) ప్రటకన విషయంపై క్లారిటీ ఇచ్చారు. జాతీయ అవార్డుల విషయంలో తనకు గల నిరాశకు కారణాలను పంచుకున్నాడు నాని. నేషనల్ అవార్డ్స్ 2023లో జై భీమ్ అవార్డును గెలుచుకోనప్పుడు నేచురల్ స్టార్ నాని నిరాశను వ్యక్తం చేశాడు. నాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన అసంతృప్తిని చూపించడానికి బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ప్రతిష్టాత్మకమైన అవార్డులలో విజయం సాధించిన RRR, పుష్ప, ఉప్పెన టీమ్‌లను నాని అభినందించారు.
అయితే నాని కోలీవుడ్‌పై ఎక్కువగా ఆసక్తిగా ఉన్నాడని, టాలీవుడ్ విజయం పట్ల అసంతృప్తిగా ఉన్నాడని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. ఈ విషయంపై సమయం రావడంతో ఆయన స్పందించారు. నాని(nani) మాట్లాడుతూ, “నా మాటలు సందర్భానుసారంగా తీసుకున్నారు. తెలుగు సినిమా సాధించిన విజయాల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచిన నా సోదరుడు అల్లు అర్జున్ పట్ల నేను చాలా హ్యాప్పీ. నాకు జై భీమ్ చిత్రం చాలా బాగా నచ్చింది. ఇది ఉత్తమ చిత్రాలలో ఒకటి. కనీసం ఒక్క కేటగిరీలో అయినా జై భీమ్ గెలవాలి. నా సోదరి ఏదో సాధించిందని, పక్కింటి నుంచి వచ్చిన నా కజిన్ సాధించలేదని అనుకుందాం. నేను నా సోదరి కోసం నా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. అదే సమయంలో, నేను మా కజిన్ కోసం కూడా బాధపడతాను. జై భీమ్ అవార్డును గెలుచుకుని ఉంటే, అది మరిన్ని చిత్రాలను ప్రయత్నించడానికి దర్శకనిర్మాతలను ప్రోత్సహించేది.’’అనేది నా అభిప్రాయం. అదే నేను కూడా వ్యక్తం చేశానని నాని క్లారిటీ ఇచ్చారు.