సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'కల్కి'. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nag Ashwin: మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా కల్కి 2898 ఏడీని తెరకెక్కిస్తున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనిదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్.. బాంబే ఐఐటీలో జరిగిన టెక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కల్కి మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించామని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూస్తారని.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని వెల్లడించారు. కల్కి ఒక కొత్త ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూశాం. కల్కిలో భారత భవిష్యత్తు నగరాలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు.
కల్కి కోసం దాదాపు ఐదేళ్లుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ను బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని నాగ్ అశ్విన్ తెలిపారు. అలాగే.. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందని.. నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ‘కల్కికి ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడం వెనుక ఒక లాజిక్ ఉంది. అయితే అది ఇప్పుడే చెప్పనని.. సినిమా రిలీజ్ సమయంలో చెబుతాను.. ఈ మూవీలో ఫ్యూచర్ ప్రభాస్‌ను చూస్తారు.. అని చెప్పారు. ఇప్పటికే.. 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంఛ్ చేసిన కల్కి ఫస్ట్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ అంచనాలను పెంచేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.