»Mrunal Thakur Fell In Love With That Hero Keanu Reeves
Mrunal Thakur: ఆ హీరోతో ప్రేమలో పడిపోయా!
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన పర్సనల్ లైఫ్ గురించి కీలక విషయాలను పంచుకుంది. అంతేకాదు ఈ అమ్మడు ఓ హీరోతో ప్రేమలో కూడా పడినట్లు వెల్లడించింది. అయితే అతను ఎవరూ అనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
Mrunal Thakur fell in love with that hero keanu reeves
సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఆమె ఓ హీరోతో ప్రేమలో పడిన విషయాన్ని రివీల్ చేసింది. అయితే అతను హాలీవుడ్ హీరో కీను రీవ్స్(keanu reeves) అని తెలిపింది. ఇతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడిపోయానని చెప్పింది. అతనంటే చాలా ఇష్టమని వెల్లడించింది. కానీ తనది మాత్రం వన్ సైడ్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. తన జీవితంలోకి కీను లాంటి వ్యక్తి రావాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇది తెలిసిన అభిమానులు వన్ సైడ్ లవ్వా..ఇంకా రియల్ ఏమో అని భయపడ్డామని పలువురు కామెంట్లు(comments) చేస్తున్నారు. పెళ్లి విషయంలో తన కుటుంబం నుంచి ఒత్తిడి ఉందని, కానీ తాను మాత్రం ప్రస్తుతం కేరీర్ పై ఫోకస్ చేసినట్లు చెప్పింది. పలు చిత్రాలతో తాను బిజీగా ఉన్నందున తనకు ప్రేమించే సమయం లేదని చెప్పింది. ఈ క్రమంలో మరి రానున్న రోజుల్లో మృణాల్ ఠాకూర్‌ని పెళ్లి చేసుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ మూడు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటైన హాయ్ నాన్నా డిసెంబర్ 21న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని(nani) సరసన యాక్ట్ చేసింది.