తెలుగు రాష్ట్రాల వారికి మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన డైలాగ్స్ చెబితే ఎలాగుంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. మోహన్ బాబు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. స్వర్గీయ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అప్పట్లో టీడీపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కి మద్దతు ఇస్తున్నారు.
అయితే… చాలా కాలంగా చంద్రబాబు కి దూరంగా ఉన్న ఆయన.. తన రెండో కుమారుడు మనోజ్ ద్వారా మళ్లీ కలవనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. రీసెంట్గా టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మీటింగ్ హాట్ టాపిక్ అయ్యింది. అది పొలిటికల్ మీటింగ్ కాదు.. కేవలం రంగంపేట శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం గురించి మాట్లాడడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని మోహన్ బాబు చెప్పి, అప్పటికి ఆ వార్తని సైలెంట్ చేశాడు.
అయితే తాజాగా మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు బయటకి రావడం… మనోజ్, మౌనికలు కలిసి గణేష్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి విషయాలని గమనిస్తే.. తెలుగు దేశం పార్టీలో భాగమైన భూమా ఫ్యామిలీతో సంబంధం గురించి మాట్లాడడానికే మోహన్ బాబు.. చంద్రబాబుని కలిశాడేమో అనే చర్చ మొదలైంది.
దాదాపు వీరి పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా… మనోజ్ పెళ్లితో మళ్లీ చంద్రబాబు, మోహన్ బాబు ఒక్కటికానున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. మరి ఏం జరగబోతోందో చూడాలి.