Manchu Lakshmi: నేను హాలీవుడ్ వెళ్లిపోతా.. నాకు, నిహారికకు ఏం తక్కువ?
మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. ఆమె మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే, ఆమెకు ఇప్పటి వరకు మంచి అవకాశాలు ఏవీ రాలేదనే చెప్పాలి. కాకపోతే ఆమె ఎంచుకున్న సినిమాలు మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమె నిజాయితీగా ఏదైనా సినిమా ఎంచుకున్నా, లేదా బయట ఎక్కడైనా మాట్లాడినా ఆమెను ట్రోల్ చేసేవారే ఎక్కువ. ఆమె మాట్లాడే పద్దతిని చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ లో తాను హీరోయిన్ గా రాణించకపోవడానికి కారణం తెలుగు ఆడియన్సే అంటూ మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు ఆడియన్స్ పై విమర్శలు కురిపించారు. ‘నేను హాలీవుడ్ యాక్టర్‌ని.. ఒకటి కాదు చాలా సినిమాలు చేశాను.. వదిలేసి టాలీవుడ్‌కి వచ్చాను. హాలీవుడ్‌లోనే ఉండి ఉంటే ఈ పదేళ్లలో నేను ఎక్కడో ఉండేదాన్ని. నాకేం కర్మ పట్టింది ఇక్కడికి వచ్చేశాను అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. పెళ్లై పాప కావాలి అనుకున్న టైంలో.. నాకు ఇక్కడ ఉంటేనే మంచిదనిపించింది. ఇక్కడ ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి.. ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు. అందుకే హాలీవుడ్ నుంచి వచ్చేశాను. లేదంటే వేరేలా ఉండేది. ఇప్పుడు పాప పెద్దది అయింది. మళ్లీ హాలీవుడ్ కి వెళ్లిపోతాను’ అంటూ పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆదరిస్తారు. కానీ, ఇక్కడి వారిని మాత్రం ఆదరించరు అని ఆమె అన్నారు.‘మధుశాలిని ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. శివానీ ఎందుకు చేయడం లేదు.. నిహారిక ఎందుకు చేయడం లేదు.. మనకంతా కేరళ, తమిళ, పంజాబీ, ముంబై, మధ్యప్రదేశ్, గుజరాతీ గర్ల్ కావాలి. తెలుగు గర్ల్స్ మాత్రం వద్దు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. తెలుగు అమ్మాయిలకు తెలుగు పీపుల్స్ నచ్చడం లేదు. అక్కడే సమస్య వస్తుంది.’ అని అన్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.