Anupama Parameswaran : అనుపమా పరమేశ్వరన్ ఇలా చేస్తుందని అస్సలు ఎవ్వరు ఊహించలేదు. కానీ అను మాత్రం తాను అనుకున్నది చేసేసింది. హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయింది. దీంతో అమ్మడి లవ్ బ్రేక్ అయిపోయింది.
తెలుగులో కాస్త పద్ధతైన హీరోయిన్ల లిస్ట్ తీస్తే.. అందులో అనుపమా పరమేశ్వరన్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా ఎక్స్‌పోజింగ్‌కు ఛాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వస్తోంది ఈ క్యూట్ బ్యూటీ. అందుకే కుర్రాళ్లకు అనుపమా డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. యూత్‌లో అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే.. అనుపమా ఇలాగే ఉండాలని గిరిగీసుకున్నారు ఆమె ఫ్యాన్స్. కానీ గ్లామర్ ఫీల్డ్ అన్నాక హద్దులు పెట్టుకుంటే కుదరదు. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక కొత్త అనుపమాను చూస్తారని.. ఎప్పుడో యూ టర్న్ తీసుకుంది అను.
రౌడీ బాయ్స్ సినిమాలోనే లిప్ లాక్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. అప్పుడే అనుపమ కిస్సింగ్ సీన్లపై హర్ట్ అయ్యారు కుర్రాళ్లు. ఒక్కసారిగా అలాంటి సీన్లో అనుపమను చూసి తట్టుకోలేకపోయారు. ఇక ఇప్పుడు.. అది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ టిల్లు స్క్వేర్‌లో ఉంటుందని మరింత ఊరించి హర్ట్ చేసింది అను. ఈ ట్రెడిషనల్ బ్యూటీ టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్‌తో రెచ్చిపోయినట్టుగా.. ట్రైలర్‌తో చెప్పేశారు మేకర్స్.
లిప్ లాక్ మాత్రమే కాదు.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. దీంతో టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అనుపమ అభిమానులు ఇంకాస్త గట్టిగా హర్ట్ అవుతున్నారు. ఇకపై నీ సినిమాలు చూడను.. ఇలాంటి రోల్స్ మనకెందుకు అను.. ఇక నీతో బ్రేకప్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ట్రైలర్‌తోనే ఇంతలా హర్ట్ అయితే.. సినిమాలో టిల్లుగాడితో అనుపమా రొమాన్స్ చూసి ఇంకెంత ఫీల్ అవుతారో చూడాలి. అది తెలియాలంటే.. మార్చి 29 వరకు వెయిట్ చేయాల్సిందే.