హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ గాసిప్స్ కామన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలోను అలాంటి పుకార్లు ఎన్నో షికార్లు చేశాయి. బాహుబలి టైంలో ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని.. ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. ఇప్పటికీ ప్రచారం జరుగుతునే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో కృతి సనన్, ప్రభాస్ మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వస్తునే ఉన్నాయి.
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా.. ఆదిపురుష్ మూవీలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి.. వీళ్లు నిజంగానే క్లోజ్‌గా మూవ్ అవుతున్నారా.. అనే సందేహాలు వెలువడ్డాయి. అనుకున్నట్టే ఇప్పుడు ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటోంది కృతి సనన్. ప్రస్తుతం కృతి సనన్..
వరుణ్ ధావన్ సరసన ‘భేడియా’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో కృతి సనన్ దగ్గర ప్రభాస్ ప్రస్థావన తీసుకొస్తున్నారు. అందులోభాగంగా.. తన జీవితంలోకి డార్లింగ్ వచ్చాడంటూ కృతి సనన్ గురించి చెప్పుకొచ్చాడు వరుణ్ ధావన్. ఇక ఇప్పుడు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది కృతి సనన్.
ఆ ఇంటర్య్వూలో టైగర్ ష్రాఫ్, ప్రభాస్, కార్తీక్ ఆర్యాన్ల పేర్లను ఆప్షన్స్‌గా ఇచ్చి.. ఈ ముగ్గురిలో ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు.. ఎవరిని పెళ్లి చేసుకుంటారు.. డేట్ ఎవరితో చేస్తారని అడిగారు. దానికి రిప్లే ఇస్తూ.. కార్తీక్‌తో ఫ్లర్ట్.. టైగర్‌తో డేట్.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది కృతి సనన్. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ ఊపందుకుంది. మరి దీనిపై డార్లింగ్ ఏమంటాడో చూడాలి.