మాటల మాంత్రికుడి నుంచి సినిమా వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది. ‘అలవైకుంఠపురంలో’ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా కమిట్ అయ్యారు త్రివిక్రమ్. కానీ అప్పటికే మహేష్ ‘సర్కారు వారి పాట’కు సైన్ చేయడం.. మధ్యలో కరోనా ఇతర కారణాల వల్ల.. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఎస్ఎస్ఎంబీ 28. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే సమ్మర్లో మహేస్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు మహేష్, పవన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు త్రివిక్రమ్. వీరిలో ఒక్క ఎన్టీఆర్‌తో తప్పితే మిగతా హీరోలతో హ్యాట్రిక్ మూవీస్ చేశారు.
అంతేకాదు మరోసారి బన్నీతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. కానీ కుదరడం లేదు. వారిలో రామ్ చరణ్, ప్రభాస్‌లతో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తమ బ్యానర్ నుంచి వస్తున్న ‘స్వాతిముత్యం’ ప్రమోషన్లో భాగంగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌తో ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ సినిమా చేయలనేదే తన కోరిక అని అన్నారు. టైమ్ వచ్చినప్పుడు దాని గురించి చెబుతామన్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్, రామ్ చరణ్‌లతో సినిమాలు చేసే ఆలోచన ఉందన్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు.