యంగ్ హీరో విశ్వక్ సేన్-అర్జున్ వివాదం అందరికీ తెలిసిందే. అర్జున్ అంతా రెడీ చేసుకున్న తర్వాత.. తీరా టైంకు షూటింగ్ క్యాన్సిల్ చేయమనడంతో.. ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అయితే విఖ్వక్ సేన్‌కు వివాదాలు కొత్తేం కాదు.. కాకపోతే ఈ సారి అర్జున్ వివాదం.. అతనిపై గట్టిగానే ప్రభావం చూపించేలా ఉందంటున్నారు.
అర్జున్, విశ్వక్.. ఇద్దరిలో ఎవరిది తప్పు అనే చర్చలో.. విశ్వక్దే మిస్టేక్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు.. కథల విషయంలో హీరోల జోక్యం ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. ఇలా అయితే విశ్వక్ సేన్‌తో సినిమాలు చేసేందుకు మిగతా దర్శక, నిర్మాతలు ముందుకు రాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. అదే జరిగితే మాస్ కా దాస్ తన సినిమాలను తానే తీసుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే విశ్వక్ అర్జెంట్‌గా ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ కాంట్రవర్శీ నుంచి బయట పడాలని.. ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే తన పై వస్తున్న కామెంట్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నాడట. ఈ క్రమంలో తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘దాస్ కా ధమ్కీ’ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం టీజర్ పనులతో బిజీగా ఉన్నాడట.
ఇప్పటికే టీజర్ కట్ చేసిన విశ్వక్.. ఫైనల్ సౌండ్ డిజైనింగ్ వర్క్‌ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు కూడా తానే కాబట్టి.. టీజర్ కట్ బాగా వచ్చిందని టాక్. మరి దాస్ కా ధమ్కీ ఏం చేస్తాడో చూడాలి.