»Imraan Hashmi On Og Movie Set 50 Percent Shooting Complete
OG Movie: ఓజీ సెట్లో ఇమ్రాన్ హష్మీ..50 శాతం షూటింగ్ కంప్లీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెట్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సందడి చేశారు. ఈ విషయాన్ని ఓజీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సుజిత్(Sujith) డైరెక్ట్ చేస్తున్న ఓజీ మూవీ(OG Movie) ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్(Action Thriller) జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా ప్రియాంక మోహన్(Priyanka Mohan) నటిస్తోంది. తాజాగా ఈ మూవీ 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్లు ఈ మధ్యనే మేకర్స్ ప్రకటించారు.
ఓజీ సెట్లో ఇమ్రాన్ హష్మీ:
It was a fantastic schedule @EmraanHashmi. Hope you had a great time on the sets of #OG.
తాజాగా ఓజీ సెట్ (OG set)లోకి బాలీవుడ్(Bollywood) హీరో ఇమ్రాన్ హష్మీ(Imran Hasmi) అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఫోటోను ట్వీట్(Tweet) చేశారు. ఇమ్రాన్ హష్మీ ఓజీ సెట్లో మంచి సమయాన్ని గడిపారని, పవన్‌తో ఆయన ఎదురుపడే షూటింగ్ సమయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన సెట్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓజీ మూవీ(OG Movie)ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మరో చిత్రం బ్రో(BRO) కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ చిత్రం జులై 28న విడుదల కానుంది. అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ(Ustaad Bhagath singh Movie) కూడా షూటింగ్ జరుపుకుంటోంది.