»I Am Definitely Enjoying My Villain Era Says Triptii Dimri
Triptii Dimri: జోయా పాత్రకు వస్తున్న స్పందనకు ఎంజాయ్ చేస్తున్నాను!
ఎన్నో ఏళ్లుగా మంచి పాత్రలు చేశాను. కానీ యానిమల్ చిత్రంలో చేసి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని యాక్ట్రస్ త్రిప్తి డిమ్రి తెలిపారు. జోయాను విలన్‌గా చూస్తున్నా ఆ అనుభూతి ఎంతో కొత్తగా ఉందని, ప్రేక్షకులను స్పందనకు తాను ఎంతో ఆనందంగా ఉన్నాని అంటున్నారు.
I am definitely enjoying my villain era, says Triptii Dimri
Triptii Dimri: యానిమల్(Animal) చిత్రంలో జోయా(Zoya) పాత్రలో అలరించిన నటి త్రిప్తి డిమ్రి(Triptii Dimri) ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉందట. జోయా పాత్ర నెగిటివ్ అయినప్పటికీ దానికి వస్తున్న స్పందనకు ఎంజాయ్ చేస్తున్నా అంటున్నారు. పరిశ్రమలో చాలా ఏళ్లుగా ఎన్నో మంచి రోల్స్‌లలో నటించినా ఈ చిత్రానికి వచ్చిన పేరు దేనికి రాలేదని ఆనందపడుతున్నారు. ప్రముఖ మీడియాతో తన అనుభూతిని పంచుకున్నారు. విలన్ షేడ్స్ ఉన్న పాత్ర తనకు సంతృప్తిని ఇచ్చింది అంటున్నారు.
న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ..గ్రే షేడ్స్ ఉన్న జోయా పాత్రను పోషించినందుకు నేను ఖచ్చితంగా ఆనందిస్తున్నాను. నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉండే, అలాగే నా కంఫర్ట్ జోన్‌కు దూరంగా ఉండే పాత్రలను పోషించాలని కోరుకుంటాను. యానిమల్ చిత్రంలో జోయా పాత్ర సరిగ్గా అలాంటిదే. ఇన్ని రోజులు మంచి పాత్రలను, సెన్సబుల్ క్యారెక్టర్లనే ప్లే చేశాను. మొదటిసారి ప్రతికూల పాత్రను పోషించాను. ఆ పాత్ర అంత బాగా వచ్చిందంటే దానికి ముఖ్య కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
“నేను ప్రాజెక్ట్‌పై సంతకం చేస్తున్నప్పుడు ఒకసారి దర్శకుడితో చాట్ చేసాను, ఆ సమయంలో సందీప్(Sandeep Reddy Vanga) ‘ఇది ప్రతికూల పాత్ర అయినప్పటికి జోయా దృష్టిలో అది సరైనదే’ అని అన్నారు. ఆ క్యారెక్టర్ విషయంలో దర్శకుడు చాలా స్టడీ చేశారు. అందుకే ఈ రోజు ప్రేక్షకులు జోయాను గుర్తుపెట్టుకున్నారు. నిజానికి ఆ పాత్ర హీరోను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడి వస్తుంది. కానీ అతను చూపించే కేర్ వలన ప్రేమలో పడిపోతుంది. ఆ సమయంలో హీరో నిజం చెప్తాడు. అప్పుడు జోయాపై ఆడియన్స్‌కు ఒక రకమైన భావన వచ్చిందని, అది ఎంతో బాగుందని తెలిపారు. ఈ చిత్రం నటీగా నేను ఎలాంటి పాత్రలు అయినా చేయగలను అనే ధైర్యాన్ని ఇచ్చిందన్నారు”.