keerthy suresh: లవర్‌తో దొరికిపోయిన కీర్తి సురేష్!
మహానటి కీర్తి సురేష్ ఎవరితో లవ్‌లో ఉంది? ఎవరా లక్కీ గాయ్? అనేది చాలా రోజులు ప్రచారం జరుగుతునే ఉంది. అయితే ఇప్పుడు కీర్తి తన లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఒకే ఒక్క ఫోటోతో కీర్తి తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిసినట్టైంది. మరి కీర్తిని పెళ్లి చేసుకోబోయేది అతనేనా?
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. రీసెంట్గా దసరా సినిమాలో వెన్నెలగా అదరగొట్టేసింది. కానీ మహానటి సినిమా తర్వాత.. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెనకబడిపోయింది. అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటలో కీర్తి ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచేసి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి కీర్తి హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. అయితే కీర్తి లవ్ మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఎప్పటికప్పుడు కీర్తి ఫలానా హీరోతోనో, లేదంటే ఫలానా వ్యక్తితోనే లవ్‌లో ఉందనే రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు మహానటి. అయితే ఇప్పుడు కీర్తికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రీసెంట్గా ఫర్హాన్ బిన్ లియాఖత్ అనే వ్యక్తి బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. అని కీర్తిసురేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ధన్యవాదాలు కిట్టీ అని రిప్లై ఇచ్చాడు ఫర్హాని. అతనికి కీర్తి ప్రేమగా బర్త్ డే విష్ చేయడం.. అతను కూడా కీర్తి సురేష్‌కి అదే రేంజ్లో రిప్లే ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కీర్తి పక్కన ఉన్నది ఖచ్చితంగా ఆమె బాయ్ఫ్రెండేనని అంటున్నారు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలుస్తోంది. అతనితో కీర్తి పెళ్లి అనే టాక్ ఊపందుకుంది. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో చిరు చెల్లెలిగా నటిస్తోంది. అలాగే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోను నటిస్తోంది. మరి కీర్తి ఇప్పటికైనా తన లవర్ గురించి ఓపెన్ అవుతుందేమో చూడాలి.