నటీనటులు – చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరీ జగన్నాధ్, సునీల్ దర్శకత్వం – మోహన్ రాజా సంగీతం – ఎస్.థమన్ నిర్మాతలు – రామ్ చరణ్, RB చౌదరి, NV ప్రసాద్ డైలాగ్స్ – లక్ష్మీ భూపాల
గాడ్ ఫాదర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయిట్ చేసిన మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజు (అక్టోబర్ 5న) గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవీ ఆచార్య మూవీ అభిమానులను నిరాశ పరిచిన నేపథ్యంలో…ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా అదిరిపోయాయి. ఇక ఇప్పుడు మూవీ స్టోరీ గురించి చుద్దాం.
స్టోరీ
గాడ్ ఫాదర్ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఓ ప్రాంతంలో సీఎం మరణంతో ఆయన వారసుడి కోసం పార్టీ వెతుకుతుంది. ఆ క్రమంలో అతని అల్లుడు పార్టికీ నిధులు సమకూర్చీ చట్టవిరుద్ధమైన వ్యాపారం నిర్వహిస్తూ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తాడు. ఈ నేపథ్యంలోనే ఆ దివంగత సీఎంకు నమ్మకస్తుడైన వ్యక్తిగా మెగాస్టార్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతని అల్లుడు, చిరుకు మధ్య జరిగిన పోరు ఎలా కొనసాగింది, తర్వాత మెగాస్టార్ ఎందుకు జైలుకెళ్లారు…వంటి అనేక ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు మలయాళ లూసిఫర్ మూవీతో పోల్చితే తెలుగులో చిరు ఇమేజ్‌కు తగినట్లుగా సినిమాలో అనేక మార్పులు చేశారు.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో మెగాస్టార్ తన యాక్టింగ్‌తో మరోసారి అదరగొట్టాడు. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. మెగా అభిమానులకు ఈ చిత్రంలో మంచి డైలాగ్స్ దొరికాయాని చెప్పవచ్చు. దీంతోపాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా దుమ్మురేపాడు. ఇక సత్యదేవ్, సముద్రఖని నటనలో మెగాస్టార్‌తో పోటీ పడ్డారు. మరోవైపు నయనతార, పూరీ జగన్నాధ్, సునీల్ కూడా తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
కొన్ని సీన్స్ మేకింగ్ చేసిన విధానం అదిరిపోయిందని చెప్పవచ్చు. దీనికి తోడు థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు. మరోవైపు ఫైట్స్, యాక్షన్ సన్నీవేశాలు టేకింగ్ కూడా బాగుంది. పెద్ద పెద్ద గ్రూపులతో మెగాస్టార్ చిరు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
చివరిగా
మెగా ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ మూవీ మంచి ఊపునిచ్చిందని చెప్పవచ్చు. ఆచార్య మూవీతో నిరాశకు లోనైన అభిమానులు..ఈ చిత్రంతో థియేటర్లలో అరుపులు, ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు. చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ యాక్ట్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. హీరోయిన్ తో సాంగ్ కాకుండా చిరు ఫ్యాన్స్ కు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పవచ్చు. మళయాల సూపర్ హిట్ మూవీ లుసీఫర్ రీమేక్ గా ఫాడ్ ఫాదర్.