నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై 3రోజుల క్రితం చెన్నైలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సమన్లు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు తన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. కాగా, అంతఃపురం మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు వచ్చారంటూ కస్తూరి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి.