తాను అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు కీలక ప్రకటన చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించలేదని వెల్లడించారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.