వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ నటించిన డంకీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. కామెడీ, ఎమోషన్స్‌తో కలగలిపిన డంకీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Dunki: బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాదిలో విడుదలైన పఠాన్, జవాన్ రెండు సినిమాలకి భారీగా కలెక్షన్లు వచ్చాయి. బాక్సాఫిస్ వద్ద దాదాపుగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో వచ్చిన షారుక్ ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. షారుఖ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే డంకీ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే డంకీ సినిమా ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాకు పోటీగా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Yeh kahani maine shuru ki thi, Laltu se! Isey khatam bhi main hi karunga… apne Ullu de patthon ke saath. Dunki's trailer will show you a journey that began with Raju Sir's vision. It will take you through a madcap ride of friendship, the comedy and tragedy that life is and a… pic.twitter.com/gEnhzHFJKZ
డంకీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. షారుక్‌ఖాన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్.. మూడు నిమిషాల పాటు సాగింది. ఒక ఊళ్లో ఉండే అయిదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్లాలని అనుకుంటారు. అధికారికంగా వెళ్లాలంటే ఇంగ్లీషు భాష రావాలి. ఈ కారణంగా వాళ్లకు వీసా రిజెక్ట్ అవుతుంది. దీంతో అక్రమ మార్గంలో లండన్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో వాళ్లు అక్రమ మార్గంలో లండన్ ఎలా వెళ్తారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేది ట్రైలర్లో తెలుస్తుంది. కామెడీతో పాటు ఎమోషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతుంది.