»Director Maha Venkatesh Shocking Comments On Kgf2
K.G.F 2: కేజీఎఫ్ సినిమాపై ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్, సారీ చెప్పిన నందినిరెడ్డి
బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్2 సినిమా (K.G.F: Chapter 2) పైన కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు (c/o kancharapalem director) మహా వెంకటేష్ (Maha Venkatesh) షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్2 సినిమా (K.G.F: Chapter 2) పైన కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు (c/o kancharapalem director) మహా వెంకటేష్ (Maha Venkatesh) షాకింగ్ కామెంట్స్ చేశాడు. అన్ని సినిమాలు (Cinema) అందరికీ నచ్చాలని లేదు… రికార్డులు బద్దలు కొట్టిన సినిమా కొందరికి నచ్చకపోవచ్చు.. అలాగే అట్టర్ ప్లాప్ అయిన సినిమా కూడా చాలామందికి నచ్చవచ్చు. కానీ ఒకరి టాలెంట్ ను మరొకరు విమర్శించడం సరికాదు. ఇలాంటి తరుణంలో మహా వెంకటేష్ (Maha Venkatesh) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన సినిమా పేరును చెప్పకుండానే, విమర్శలు చేశాడు. దీనిపై నెటిజన్లు (netizens), సినిమా ప్రియులు (Cinema Fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇక్కడున్న (ఇంటర్వ్యూలో ఉన్న) ఐదుగురం, మాతో పాటు మాలా సినిమాలు తీసే ఇండస్ట్రీలోని (Film Industry) ఇంకొందరు డైరెక్టర్స్ … మేమంతా అభ్యుదయ భావాలను పక్కన పెట్టి వయలెన్స్ సినిమాలు తీస్తే వాళ్లకన్నా గొప్పగా తీయగలం. కానీ మేం అలా చేయడం లేదు. కొన్ని విలువలతో సినిమాను తీస్తున్నాం.. వాటిని చూసి ఓటీటీ సినిమాలు అంటూ డీగ్రేడ్ చేస్తున్నారు అని మండిపడ్డారు.
అదే సినిమా చివరలో తవ్విని వాళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి, ఆ బంగారాన్ని అంతా తీసుకొని, వెళ్లి సముద్రంలో పడేసే నీచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.. వాటిని కమర్షియల్ అంటున్నారు. కానీ మా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ కు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతున్నాయని అన్నాడు. కానీ వెయ్యి కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమాలు బడ్జెట్ పై రెండు మూడు కోట్లు మాత్రమే తెచ్చి పెడుతున్నాయన్నారు. ఇంకా మాట్లాడుతూ… ప్రపంచంలో ఓ తల్లి కొడుకును నువ్వు ఎప్పటికైనా గొప్పోడివి అవ్వరా.. గొప్పోడు అంటే మా దృష్టిలో సంపాదించి నలుగురికి ఉపయోగపడటం అని, కానీ ఇక్కడ నాకు ఓ ప్రశ్న ఉంది, తల్లి గోల్డ్ కావాలని చెబుతుంది. ఆ గోల్డ్ ను తవ్వి తోడేవాళ్లు ఉంటారు… వీడి వెళ్లి వాళ్లను ఉద్దరిస్తాడు.. ఆ తర్వాత పాట వస్తుంది.. చివరలో వీడు పెద్ద మొత్తంలో గోల్డ్ ను పోగేస్తాడు. ఎంత నీచ్ కమీన్ కుత్తే అయితే అంతా తీసుకెళ్లి ఎక్కడో పార దొబ్బుతాడు.. పని చేసిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే.. అలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తున్నాం.. చప్పట్లు కొడుతున్నాం.. అని చెబుతూ ఇది మీరు అనుకునే సినిమా కాదు.. అన్నాడు మహా వెంకటేష్. అయితే ఈ వ్యాఖ్యలు కేజీఎఫ్ 2ను ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది.
దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంటర్వ్యూలో ఐదుగురు ఉన్నారు. తీసిన రెండు సినిమాలకు ఇంత పొగరు మంచిది కాదని, నీ కాన్సెప్ట్ నీది, ఇతరుల కాన్సెప్ట్ తో నీకేం సంబంధం.. అలాంటి సినిమా ఒక్కటి తీసి చూడరాదు అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మీకు ఓ సినిమా నచ్చలేదని డీగ్రేడ్ చేయడం ఏమాత్రం సరికాదని సూచించారు. మనం మాట్లాడే విధానం బాగుండాలని చాలామంది నెటిజన్లు హితవు పలికారు. కాగా, ఈ ఇంటర్వ్యూ సమయంలో మహా వెంకటేష్ తో పాటు నందిని రెడ్డి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మిగతా నలుగురు నవ్వుతూ కనిపించారు. దీనిపై పలువురు నెటిజన్లు నందిని రెడ్డి వంటి వారికి చురకలు అంటించారు. మేడం మీలాంటి వారు కూడా ఇలా హేళన చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందించి.. సారీ చెప్పారు. హిట్ అయిన ప్రతి కమర్షియల్ సినిమా వెనుక ఆడియన్స్ ఉన్నారని, వారి ప్రేమ దాగి ఉందని, ఆ సినిమా విషయంలో వారు పెట్టిన ఎఫర్ట్ లో ఏదో ఒక విషయం ప్రేక్షకులకు నచ్చిందని అర్థమని చెప్పారు. అలాగే తమ మధ్య జరిగిన సంభాషణ ఎవరినీ కించపరచాలని కాదని, కమర్షియల్ సినిమా అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక హెల్తీ డిస్కషన్ చేశాం తప్ప అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలన్నారు.