జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి(anudeep kv).. తాజాగా ప్రిన్స్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జాతి రత్నాలు తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రిన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ జాతిరత్నానికి ఈ మధ్యలో భారీ డ్యామేజ్ జరిగింది. దాంతో ప్రిన్స్ రిజల్ట్ కీలకంగా మారింది. అయితే ఈ వారం బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది. రెండు తమిళ చిత్రాలు.. రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
అయితే ఈ నాలుగు సినిమల్లో మూడు తమిళ్ వాసన కలిగిన చిత్రాలే కావడం విశేషం. తెలుగు నుంచి వస్తున్న స్ట్రెయిట్ మూవీ జిన్నా మాత్రమేనని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ తమిళ్ మూవీ ‘ఓ మై కడవులే’ రిమేక్‌గా తెరకెక్కింది. అలాగే కార్తీ నటించిన ‘సర్దార్’ మూవీ తమిళ్ చిత్రమే. ఇక ‘ప్రిన్స్’మూవీకి డైరెక్టర్ తెలుగోడే అయిన హీరో మాత్రం శివ కార్తికేయన్. దాంతో ఏ సినిమాది పై చేయి అనేది ఆసక్తికరంగా మారింది. కానీ డైరెక్టర్ అనుదీప్‌కు మాత్రం ప్రిన్స్ సినిమా హిట్ తప్పని సరిగా మారింది.
జాతిరత్నాలు బ్రాండ్‌తో వచ్చిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు వేరే అయినా.. అనుదీప్నే ఈ సినిమాను అన్నీ తానై నడిపించాడు. కానీ కంటెంట్ వీక్‌గా ఉండడంతో.. ఈ యంగ్ డైరెక్టర్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. అందుకే ప్రిన్స్ మూవీతో.. అనుదీప్ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హిట్ అయితే.. జాతిరత్నానికి ఢోకా లేనట్టే. కానీ బాక్సాఫీస్ వార్ మాత్రం గట్టిగానే ఉంది. కాబట్టి ప్రిన్స్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.