మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జునల మధ్య బాక్సాఫీస్ వార్ స్టార్ట్ అయిపోయింది. దసరా సందర్భంగా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగ్ ‘ది ఘోస్ట్’ సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. అయితే ఒకే రోజు ఈ సీనియర్ హీరోలు, పైగా మిత్రులు పోటీ పడడం బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాదు ఈ ఇద్దరు ఒకరి సినిమాను, ఒకరు తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు ఇంటర్వ్యూలలో ఇద్దరి సినిమాలు హిట్ కావాలని అంటున్నారు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదని, ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవని చెబుతున్నారు. అయినా ఈ ఇద్దరు కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికీ కూడా ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకం కానుంది.
ఈ క్రమంలో దసరా బరిలోనే ఎందుకు దిగారనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు వారం గ్యాప్లో వస్తే కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉండేది. పైగా ప్రభుత్వ సెలవులు రెండు వారాలున్నాయి. అలాగే పోయిన వారం డబ్బింగ్ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. దసరా తర్వాత కూడా స్లాట్ ఖాళీగా ఉంది. కానీ దేని లెక్క దానికే అన్నట్టు.. ఇద్దరు దసరాను క్యాష్ చేసుకునేలా.. బాక్సాఫీస్ పోరుకే సై అన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారు.. ఇద్దరికీ విజయం దక్కుతుందా అనేది.. మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇద్దరి మధ్యలో ‘స్వాతిముత్యం’ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అదుకుంటాయనేది తెలియాలంటే.. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.