Ranveer Singh: రణ్ వీర్ సింగ్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్

బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 07:01 PM IST

Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్(Ranveer Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో హీరోగా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో అంతకంటే ఎక్కువగా సినిమా వేడుకల్లో ఆయన ఎనర్జీతో అంత పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తిరుగుతుంది. ఓ జాతీయ పార్టీకి ఓటు వేయండి అని చెప్పె ఓ వీడియో వైరల్ అవడంతో అందరూ అది నిజమే అనుకున్నారు. తాజాగా అది డీప్ ఫేక్ వీడియో అని, ఏఐ వీడియోల పట్ల కాపాడండి అని స్వయంగా రణ్ వీర్ సింగ్ పోస్ట్ పెట్టారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చదవండి:Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన రష్యా ప్రతినిధులు.. సినిమాలపై సుదీర్ఘ చర్చ

అందాల హీరోయిన్ కృతిసనన్‌తో కలిసి రణ్ వీర్ సింగ్ వారణాసిని సందర్శించారు. ఆ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో ఆయన ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడారు. విశ్వానాథ ఆలయం, వారనాసి గురించి మాట్లాడుతూ.. తన తల్లి, భార్య దీపిక పడుకొనేలతో ఇక్కడి వచ్చినట్లు వారికి కూడా ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. దాన్ని ఓ రాజకీయ పార్టీకి అన్వయించి ఆ పార్టీని గెలిపించండి చెప్పినట్లు క్రియేట్ చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలు నిజమే అని నమ్మారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది వరకు కూడా అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ ఈ డీప్‌ఫేక్‌లకు బలైపోయారు.