»Baby The Movie Heroine Vaishnavi Chaitanya Struggled A Lot
Vaishnavi chaitanya: ‘బేబీ’కి ఇన్ని కష్టాలా?
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది బేబి సినిమా. దాదాపుగా వంద కోట్ల చేరువకు వచ్చి ఆగిపోయాయి బేబీ వసూళ్లు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ చిన్న సినిమా ఈ రేంజ్ హిట్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన vaishnavi chaitanya బేబికి ఊహించని గుర్తింపు వచ్చింది. కానీ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందట బేబీ.
Baby the movie heroine vaishnavi chaitanya struggled a lot
సాయి రాజేష్(sai rajesh) తెరకెక్కించిన బేబీ మూవీని.. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య(vaishnavi chaitanya) హీరోయిన్గా నటించారు. అప్పటి వరకు ఒక యూట్యూబర్‌గా ఉన్న వైష్ణవి చైతన్యకు ఈ సినిమా సాలిడ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే బేబీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ కూడా బేబీ దగ్గర డేట్స్ లాక్ చేసుకున్నాయి. అయితే బేబీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడిందట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాన్ని చెప్పుకొచ్చింది వైష్ణవి. కెరీర్ స్టార్టింగ్‌లో డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేసిన వైష్ణవి.. ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించింది. ఇక బేబీ సినిమాతో హీరోయిన్గా జెండా పాతేసింది. ఇలా ఓవరాల్ వైష్ణవి గురించి అందిరికీ తెలిసినా.. తనకు ఎదురైన ఇబ్బందులను తలచుకుని చాలా ఎమోషనల్ అయింది.
పదో తరగతి చదివే రోజుల్లోనే తనపై కుటుంబ బాధ్యత పడిందని, ఆ సమయంలో తనకు డాన్స్(dance) మాత్రమే వచ్చు అని, దాంతో పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీల్లో డాన్స్ చేసి డబ్బులు తీసుకునేదాన్ని, అలా వెళ్లినప్పుడల్లా రూ.700 వచ్చేవి.. అని చెప్పింది. అలాగే చిన్న నటులకు కారవాన్ ఇవ్వరు. ఓసారి తప్పని పరిస్థితుల్లో వాష్ రూమ్‌కి వెళ్ళాలి మీ కరవాన్ వాడుకోవచ్చా అని ఓ హీరోయిన్ అడిగితే.. ఇష్టం వచ్చినట్టు తిట్టిందని చెప్పుకొచ్చింది. చేసేది లేక బాత్ రూమ్ లో బట్టలు మార్చుకోవడంతో అమ్మ చాలా బాధ పడి.. మనకు ఈ ఫీల్డ్ వద్దని చెప్పింది. కానీ అప్పుడే తనలో ఇంకా కసి పెరిగిందని, ఎలాగైనా పెద్ద హీరోయిన్ కావాలని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చింది. అన్నట్టే బేబీతో హీరోయిన్గా దుమ్ముదులిపేసింది వైష్ణవి చైతన్య.