ఈ ఏడాది సూపర్ స్టార్, పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. హిట్ సినిమాలు పోకిరి, జల్సా.. రీ రిలీజ్‌లతో రచ్చ చేశారు ఫ్యాన్స్. స్పెషల్ షోలతో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. దాందో నెక్ట్స్ ఇయర్ కూడా భారీ ప్లానింగ్‌లో ఉన్నారు. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా.. ఒక్కడు, పోకిరి సినిమాలను స్పెషల్ షో వేసిన సంగతి తెలిసిందే. 350 పైగా స్క్రీన్స్‌లో ఏకంగా కోటిన్నరకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది పోకిరి. ఇక అంతకు మించి అనేలా పోకిరి రికార్డు బద్దలు కొట్టింది జల్సా. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా.. ఏకంగా 700 పైగా స్పెషల్ షోలతో.. రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది జల్సా. ఇక ఈ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను తమ అభిమాన హీరోల పేరిట చారిటీకి ఇచ్చారు సూపర్, పవర్ ఫ్యాన్స్.
దాంతో వచ్చే బర్త్ డేకు కూడా ఇదే ప్లానింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మహేష్ నెక్ట్స్ బర్త్ డేకి ‘అతడు’ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట ఘట్టమనేని అభిమానులు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో సెన్సేషనల్‌గా నిలిచిన ‘ఖుషీ’ మూవీకి డిజిటల్ ప్రింట్ రెడీ చేయబోతున్నట్టు టాక్. ఆ చిత్ర నిర్మాత ఏ.ఎం రత్నం.. ఈ ఏడాదే ఖుషీ రీ మాస్టర్డ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే అప్పటికే తమ్ముడు, జల్సా లైన్లో ఉండడంతో.. దాన్ని వాయిదా వేసుకున్నారట. దాంతో పవన్ నెక్స్ట్ పుట్టిన రోజుకి.. ఖుషీ రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. నెక్ట్స్ ఇయర్ ఖుషీ వర్సెస్ అతడుగా మారనుందని చెప్పొచ్చు.