Director Parasuram: డైరెక్టర్ పరశురామ్ ( Parasuram) గురించి అల్లు అరవింద్ కామెంట్ చేయడంతో ట్రోల్ అయ్యింది. పరశురామ్ (Parasuram) ఇలాంటి వాడ అనే చర్చ జరుగుతోంది. ఇంతలో 14 రీల్స్ సంస్థ వచ్చింది. పరశురామ్ ( Parasuram) తమను కూడా మోసం చేశారని చెబుతోంది. తమతో మూవీ చేస్తానని చెప్పి.. వాయిదా వేశాడని అంటోంది. దీంతో తమకు నష్టం జరిగిందని.. సినిమా తీస్తావా..? లేదంటే కొత్త సినిమాలో భాగస్వామ్యం ఇప్పిస్తావా అని డిమాండ్ చేస్తోంది.
14 రీల్స్ సంస్థ నాగ చైతన్య, పరశురామ్‌తో ( Parasuram) కలిసి సినిమా చేయాల్సి ఉంది. పరశురామ్ వీరికి హ్యాండ్ ఇచ్చి.. మహేశ్ బాబుతో సర్కార్ వారి పాట మూవీ చేశారు. ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పరశురామ్.. 14 రిల్స్ నిర్మాతలను కలిశారు. కార్తీతో సినిమా చేద్దాం అని కలువగా.. అప్పటికే కార్తీ ఇతర సినిమాలతో ఉన్నారు. నవంబర్ లేదంటే జనవరిలో చేద్దామని అన్నారట.
చేసేదేమీ లేక దిల్ రాజును కలిసి విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నాడు. విషయం తెలిసి 14 రీల్స్ సంస్థ ఆశ్చర్యపోయింది. తమ మూవీ చేయకుండా మరో సినిమా ఎలా చేస్తారని అడుగుతోంది. సినిమా అనౌన్స్ చేయడం వల్ల తమకు నష్టం జరిగిందని.. తమతో కచ్చితంగా మూవీ చేయాలని అంటోంది. లేదంటే విజయ్ మూవీలో భాగస్వామ్యం అయినా కల్పించాలని కోరుతుంది. 14 రీల్స్ వాదన ఇలా ఉండగా.. విజయ్ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయం గురించి దిల్ రాజు పట్టించుకోవడం లేదు. పరశురామ్ ( Parasuram) ఇలా మరొ చెడ్డ పేరు దక్కించుకున్నారు.