ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరో వివాదంలో చిక్కింది. కొత్త పోస్టర్లో ప్రభాస్ జంధ్యం ధరించలేదని సనాతన ధర్మ బోధకుడు సంజయ్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
Adipurush:డార్లింగ్ ప్రభాష్ ‘ఆదిపురుష్’ (Adipurush) మూవీ మరో వివాదంలో చిక్కింది. ఇప్పటికే మూవీలో కొన్ని పార్ట్స్ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్ (vfx) అనుకున్న స్థాయిలో లేకపోవడంతో తప్పడం లేదు. సినిమాలో రాముడిగా (lord rama) ప్రభాస్ (prabhas), సీతగా (sita) కృతి సనన్, లక్ష్యణుడిగా సన్నీ సింగ్ (sunny singh), రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) నటిస్తున్నారు.
ఆదిపురుష్ (Adipurush) మూవీ కొత్త పోస్టర్‌ను (new poster) ఇటీవల శ్రీరామ నవమి (sri rama navami) పర్వదినం సందర్భంగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై (poster) సనాతన ధర్మ బోధకుడు సంజయ్ దినానత్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబైలో గల సాకినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ (complaint) ఇచ్చారు. ఆయనతోపాటు ముంబై హైకోర్టు (mumbai high court) న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ఉన్నారు.
ఆ పోస్టర్లో దర్శకుడు ఓం రౌత్.. రామ్ చరిత్ మానస్‌లోని రాముడి (lord rama) పాత్రను అనుచితంగా ప్రదర్శించారని సంజయ్ (sanjay) అంటున్నారు. దీనిపై ఐపీసీ 295 (ఏ), 298, 500, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. రాముడి పాత్ర పోషిస్తోన్న ప్రభాస్ (prabhas) ఆ పోస్టర్లో జంధ్యం ధరించి కనిపించలేదని పేర్కొన్నారు. జంధ్యం ధరించడం అనేది సనాతన హిందూ సాంప్రదాయం అని.. దానికి చాలా ప్రాధాన్యం ఉందని వివరించారు.
మూవీ టీజర్ (teaser) రిలీజ్ చేసిన సమయంలో కూడా ఇలానే విమర్శల పాలయ్యింది. కొందరు హిందువులు అభ్యంతరం తెలిపారు. మరికొందరు వీఎఫ్ఎక్స్ (vfx) బాగోలేవని చెప్పారు. దీంతో సినిమాను ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దేందుకు కొన్ని భాగాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చుపెడుతూ.. పాన్ ఇండియా (pan india) మూవీలాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీకి వివాదాలు మాత్రం తప్పడం లేదు.