అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా యానిమల్ ఈరోజు(డిసెంబర్ 1న) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో అమెరికా సహా పలు చోట్ల ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(ranbir kapoor) యాక్ట్ చేసిన యానిమల్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న తదితరులు యాక్ట్ చేయగా..అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు(డిసెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎంటో తెలుసుకుందాం. అమెరికాతోపాటు పలు చోట్ల ఈ చిత్రం ప్రిమీయర్ షోలు ప్రదర్శించింది. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలను ఇక్కడ చుద్దాం.
యానిమల్ సినిమా నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ యాక్షన్ సినిమా అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
ఇంకో వ్యక్తి అయితే ఈ చిత్రం నెక్ట్స్ లెవల్ అని రాసుకొచ్చారు. రణబీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ రెడ్డి దర్శకత్వానికి దండం సామి అని కామెంట్లు చేశాడు. అంతేకాదు ఇది సినిమా ఆఫ్ ది ఇయర్ అని పేర్కొన్నాడు.