»Aishwarya Rai Bachchan 50 Years Birthday Do You Know How Much Her Property How Much
AishwaryaRaiBachchan: ఐశ్వర్యకు 50 ఏళ్లు..ఈమె ఆస్తి ఎంతంటే?
భారత సినీ పరిశ్రమలో ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్(AishwaryaRaiBachchan) తన 50వ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతోపాటు పలువురు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ భామ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Aishwarya rai bachchan 50 years birthday Do you know how much her property how much
భారతీయ సినిమా రంగంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్(AishwaryaRaiBachchan) గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పవచ్చు. హిందీ, తమిళ్, తెలుగుతోపాటు అనేక భాషల్లో 50కిపైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే నేడు (నవంబర్ 1న) తాను 50వ పుట్టినరోజును పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నటి గురించి పలు విషయాలను తెలుసుకుందాం. ఐశ్వర్య రాయ్ బచ్చన్ నవంబర్ 1, 1973లో మంగళూరులో జన్మించారు. తన కాలేజీ చదువుల తర్వాత మోడలింగ్ కోసం ఏకంగా తన చదవును సైతం ఐశ్వర్య విదిలేయడం విశేషం. ఆ క్రమంలోనే ఈమె 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఐశ్వర్య 1997లో తమిళ చిత్రం ఇరువర్తో నటనా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఔర్ ప్యార్ హో గయా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఐశ్వర్య చాలా చిత్రాలలో బోల్డ్ సీన్లలో యాక్ట్ చేయకుండా తప్పించుకున్నారు. అయినప్పటికీ ధూమ్ 2, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రాలలో ఆమె అందాల కనువిందు చేసిందని చెప్పవచ్చు. ఐశ్వర్యరాయ్ ఓసారి తాను యాక్ట్ చేసిన హాలీవుడ్ చిత్రం ‘ది పింక్ పాంథర్ 2’ ప్రమోషన్ కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఒక రిపోర్టర్ ఆమెను తన గ్లామర్ షో, రొమాన్స్ సీన్ల గురించి అడిగారు. ఆ క్రమంలో ఐశ్వర్య మాట్లాడుతూ తాను సినిమా తెరపై సాన్నిహిత్యాన్ని ప్రొత్సహించడం తనకు ఇష్టం లేదని తెలిపింది.
ఆ తర్వాత ఐశ్వర్య టీవీ హోస్ట్ డేవిడ్ లెటర్మాన్ షోకి వెళ్లినప్పుడు, అక్కడ ఆమెను ఒక వింత ప్రశ్న అడిగారు. ఆ సమయంలో ఆమె తన హాలీవుడ్ చిత్రం బ్రైడ్ అండ్ ప్రెజూడీస్ ప్రచారానికి వెళ్ళింది. డేవిడ్ లెటర్మాన్ ఐశ్వర్య తన తల్లిదండ్రులతో నివసిస్తున్నారా అని అడిగారు. నిజానికి, డేవిడ్ లెటర్మాన్ ఐశ్వర్యను ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. డేవిడ్ ప్రశ్న, ‘ఐశ్వర్య, మీరు ఇప్పటికీ మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా? భారతదేశంలో పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి జీవించడం నిజంగా సాధారణమా? అందుకు ఐశ్వర్య తల్లిదండ్రులతో కలిసి జీవించడం వల్ల ఎటువంటి నష్టం లేదని తెలిపింది. భారతదేశంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులతో జీవిస్తారని ఐశ్వర్య అన్నారు. మన తల్లిదండ్రులను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోనవసరం లేదనేది భారతదేశంలో సాధారణ విషయమని ఐశ్వర్య చెప్పిన సమాధానం డేవిడ్ లెటర్మన్ను నోరు మెదపనీయలేదు. అంతేకాదు ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న ఐశ్వర్య మరింత ప్రజాదరణ పొందింది.
ఐశ్వర్య నికర విలువ సుమారు రూ.776 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా నిలిచింది. ఆమె తన పాత్ర నిడివిని బట్టి సినిమాకు దాదాపు రూ. 10-12 కోట్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం ఒక రోజుకు రూ. 6-7 కోట్లు వసూలు చేస్తుందని తెలిసింది. తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ముంబైలోని జుహు ప్రాంతంలోని జల్సాలోని బచ్చన్ ఫ్యామిలీ బంగ్లాలో నివసిస్తోంది. దీని విలువ రూ.112 కోట్లు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో రూ. 16 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్, రూ.20 కోట్ల విలువైన దుబాయ్‌లోని శాంక్చురీ ఫాల్స్, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో ఈ జంట కలిసి ఒక విల్లాను కలిగి ఉన్నారు. వీటన్నింటితో పాటు ఐష్ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8L, Mercedes-Benz S500, Mercedes Benz S350d Coupe, Lexus LX 570 మరిన్ని కార్లు కూడా ఉన్నాయి.