కన్నడ నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, శోభిత.. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.