రాజ్ అండ్ డీకే దర్శకులపై నటి సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వారితో కలిసి పని చేయడంతో పోలిస్తే తెలుగు, తమిళం చిత్రాల్లో వర్క్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా నా సినిమాల్లో ఒక రోజుకు 2 లేదా 3 సీన్స్ షూట్ చేసేవారు. కానీ ఇక్కడ అలా కాదు.. ఒక గంటలోనే ఆ సీన్స్ చిత్రీకరిస్తారు. రాజీ (ది ఫ్యామిలీ మ్యాన్ 2లో) పాత్రలో కొన్ని సన్నివేశాల షూట్ సమయంలో నా వల్ల కావట్లేదని ఏడ్చేశా’ అని తెలిపింది.