సినీ నటి నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ’35 చిన్న కథ కాదు’. నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ఈ సినిమా అరుదైన ఘనతను దక్కించుకుంది. గోవాలో నిర్వహించే 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. ఇక గోవాలో వచ్చే నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.