ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్స్‌లో తన కెరీర్లోనే ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి, 910 పాయింట్లు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్‌లో 26 నాటౌట్‌గా నిలిచి, 908 పాయింట్లు దక్కించుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఈ రోజు మూడో టీ20 ఉంది. ఇక్కడ బ్యాట్‌ను ఝులిపిస్తే పాయింట్లు మెరుగు పడతాయి. 2020లో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మిలన్ 915 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఈ విషయంలో మిలన్ తర్వాత సూర్యకుమార్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికయ్యాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో సూర్యకుమార్ 908 పాయింట్లతో నిలిచాడు. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ (పాక్, 836), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్ 788), బాబర్ అజమ్(పాక్, 778), ఎయిడెన్ మార్కరమ్(సౌతాఫ్రికా 748) ఉన్నారు.
సూర్యకుమార్ ఆటతీరుపై సీనియర్లు, తోటి ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ యాదవ్‌ను ప్రశంసించాడు. ఇన్నోవేషన్, స్కిల్ విషయంలో అంతటి మంచి ఆటగాడిని తాను ఇంతవరకు చూడలేదన్నాడు. అందురూ డివిలియర్స్, గిల్‌క్రిస్ట్‌తో అతన్ని పోలుస్తున్నారని, నిజానికి అతను వారికంటే మెరుగ్గా ఆడుతున్నాడని ఆకాశానికెత్తాడు. టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయిదారేళ్లుగా సూర్య ఐపీఎల్లో ఇలాంటి ఆటతో అలరిస్తున్నాడని, డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా బాల్‌ను ఫ్లిక్ చేయడంలో, బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా కొట్టడంలో అతనికి మించిన వారు లేరన్నాడు. షార్ట్ బాల్స్‌ను కూడా కీపర్ తలపై నుండి ఫ్లిక్ చేసి, ఫోర్లు, సిక్సులుగా మలుస్తున్నాడన్నాడు. కొత్త షాట్స్ విషయంలో, స్కిల్ విషయంలో సూర్య అద్భుతమన్నాడు. అతని ఆటతీరు టీ20కి మేలు చేస్తుందని, యువ క్రికెటర్లు అతనిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారన్నాడు.