Sudhamurthy : ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు : సుధామూర్తి
వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్నిసుధామూర్తి బయటపెట్టారు. ‘‘ ఇటీవలే నేను యూకే (UK) వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ గురించి అడిగారు. ‘లండన్‌లో ఎక్కడ ఉంటారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు మా అక్క కూడా నాతో పాటే ఉంది. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్ నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ (10 Dowing Street)ను అడ్రస్‌గా రాశానున్నారు
ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudhamurthy) అంటే దాదాపు తెలియని వారు ఉండరు. రచయితగా, దాతృత్వ కార్యక్రమాలతో ఎంతో మందికి సుపరిచితురాలు. అలాగే బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్(Rishi Sunak) కు అత్తగారు కూడా. కోట్లాది రూపాయలు, పలుకుబడి ఉన్నా ఆమె నిరాడంబరతకు మారు పేరు. ఆమె కట్టుబొట్టూ సాధారణ మధ్య తరగతి గృహిణిలా ఉంటారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆమె ఎంతో సింపుల్‌గా తన జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అందుకేనేమో తాను బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అత్తగారినంటే లండన్(London)లో ఎవరూ నమ్మలేదని చెప్పారు సుధామూర్తి.అమెజాన్‌లో తక్కువ ధరకే స్మూత్ స్క్రీన్, గొప్ప పెర్ఫార్మన్స్ చూపే టాప్ క్వాలిటీ టాబ్లెట్స్‌ను సొంతం చేసుకోండి కొద్ద రోజుల క్రింత బాలీవుడ్ (Bollywood) టాక్ షో ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న సందర్భంలో తనకు లండన్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు సుధామూర్తి. తవ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
తన వస్త్రధారణ కారణంగా లండన్‌లో ఎదురైన ఓ వింత అనుభవాన్ని బయటపెడ్డారు. ‘కొద్ది రోజుల క్రితమే నేను లండన్ వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్(Immigration) అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. లండన్‌లో మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. ఆ సమయంలో మా సోదరి నాతో పాటే ఉంది. నా కొడుకు సైతం యూకే (UK)లోనే ఉంటాడు. కానీ, నా కొడుకు ఉండే అడ్రస్ నాకు తెలియదు. వెంటనే నా అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ అడ్రస్ రాసి ఇచ్చాను. అది చూడగానే ఇమ్మిగ్రేషన్ అధికారి నన్ను ఎగాదిగా చూశాడు. జోక్ చేస్తున్నారా? అంటూ నన్ను అడిగారు. దీంతో నేను నిజం చెప్పినా వారు నమ్మినట్లు నాకు అనిపించలేదు. నాలాగా సింపుల్‌గా ఉండే మహిళ ఒక ప్రధానికి అత్తగారంటే ఎవరూ నమ్మలేదని నాకు అర్థమైంది.’ అని తనకు ఎయిర్‌పోర్టులో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు సుధామూర్తి.
మరోవైపు.. తన పెళ్లి, కుటుంబం గురించి సైతం పలు విషయాలను ఈ షోలో పంచుకున్నారు సుధామూర్తి. పెళ్లి కాక ముందు నారాయణ మూర్తి(Narayana Murthy)ని తొలిసారి చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారామే. ఆయన హీరాలో ఉంటారమేమోనని తాను అనుకున్నానని చెప్పారు. నారాయణ మూర్తి తమ పెళ్లికాక ముందు ఎంత బరువు ఉండేవారని, ఇప్పటికీ అలాగే ఉన్నారని, తనకు వంట సరిగా రాకపోవడంతోనే ఆయన అలా ఉండిపోయారని నవ్వులు పూయించారు. సుధామూర్తి, నారాయణ మూర్తి పెళ్లి 1978లో జరిగింది. వీరికి ఒక కుమార్తె అక్షతా, కుమారుడు రోహన్ (Rohan) ఉన్నారు. సుధామూర్తి సేవలకు గానూ ఈ ఏడాది సుధామూర్తికి పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. కపిల్ శర్మ (Kapil Sharma) షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్(Raveena Tandon), నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు.