Joe Biden: ఒడిశా(Odisha)లోని బాలాసోర్(balasore) జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దాదాపు మూడు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల(Train accident)లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించారు. దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై అమెరికా(America) అధ్యక్షుడు జో బిడెన్(joe biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చాలా మందికి తన సంతాపాన్ని తెలియజేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం. అమెరికా రెండూ ఒక కుటుంబం వలే సంస్కృతి సంబంధాలతో లోతైన బంధాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా అంతటా ప్రజలు భారతదేశ ప్రజలతో కలిసి సంతాపం తెలిపారు. పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగుతున్నందున, ఈ విషాదకర ఘటన నుంచి బయటపడేలా మా ఆలోచనలన్ని భారతదేశ ప్రజల చుట్టూనే ఉంటాయని బైడెన్ అన్నారు.