పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దుబాయ్‌లో అమెరికాకు చెందిన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవీ చేపట్టక ముందే పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడిగా పనిచేశారు. 1943 ఆగస్ట్ 11వ తేదీన ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. ప్రాథమిక విద్య కరాచీలో గల సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్లో జరిగింది. లాహోర్‌లో గల ఫార్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తిచేశారు.
ఆర్మీలోకి ఎంట్రీ
ముషారఫ్ ఆర్మీలోకి వచ్చారు. 1998లో జనరల్ ర్యాంక్ సాధించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలను స్వీకరించారు. 1999లో పాక్ ప్రభుత్వాన్ని మిలటరీ అధీనంలోకి తీసుకుంది. దీంతో మిలటరీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్ దేశ అధ్యక్షుడు అయ్యారు. 2001 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. ముషారఫ్ మృతి చెందారని పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాప్ నేత ఫావాద్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ముషారఫ్ గొప్ప వ్యక్తి, పాకిస్థాన్ ముందు అని ఎప్పుడూ అనేవారు. అతని సిద్దాంతం కూడా అదే.. ఆ దేవుడు అతనిని కరుణిస్తాడు’ అని సంతాపం తెలిపారు.
అనారోగ్యం
ముషారఫ్ అనారోగ్యంతో ఉన్నారని అతని కుటుంబ సభ్యులు జూన్ 10వ తేదీన తెలిపారు. అవయవాలు పనిచేయని స్థితికి చేరాయని, కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పారని అప్పుడే చెప్పారు. ముషారఫ్ వెంటిలేటర్‌పై లేరు అని.. గత 3 వారాల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 2018 నుంచి ప్రాణాంతక వ్యాధి అమిలోయిడోసిస్తో ఆయన బాధపడుతున్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి. అవయవాల్లో అసాధారణంగా ప్రొటిన్ ఏర్పడుతుంది. దీంతో అవయవాల పనితీరుపై ప్రభావం పడటంతో కోలుకోలేకుండా ఉంటారు. 2016 మార్చిలో ముషారఫ్ చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. ఇక అప్పటినుంచి తిరిగి రాలేదు.
దేశద్రోహాం కేసులు
ముషారఫ్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసు, రెడ్ మసీదు మత గురువు హత్య కేసులో పరారీలో ఉన్నారు. ముషారఫ్‌పై దేశద్రోహాం అభియోగాలు కూడా మోపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు 2019లో మరణశిక్ష కూడా విధించారు.. తర్వాత తాత్కాలికంగా నిలిపివేశారు.
Message from Family:
He is not on the ventilator. Has been hospitalized for the last 3 weeks due to a complication of his ailment (Amyloidosis). Going through a difficult stage where recovery is not possible and organs are malfunctioning. Pray for ease in his daily living. pic.twitter.com/xuFIdhFOnc