Health Tips: డార్క్ చాక్లెట్ తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. చాక్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివేమీ కాదు. కానీ వాటిలో డార్క్ చాక్లెట్ మాత్రం చాలా భిన్నం. వాస్తవానికి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిజమైన డార్క్ చాక్లెట్ ప్రాసెస్ చేయరట. డార్క్ చాక్లెట్, తియ్యని మిల్క్ చాక్లెట్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయట. మరి అవేంటో మనమూ చూసేద్దాం.
డార్క్ చాక్లెట్(Dark chocolates)లో ఉండే సమ్మేళనం థియోబ్రోమిన్. థియోబ్రోమిన్ కెఫిన్‌ను పోలి ఉంటుంది. ఈ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. జలుబు చేస్తే చాక్లెట్‌తో కూడిన మందులు తీసుకుంటే రెండు రోజుల్లో జలుబు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. డార్క్ చాక్లెట్(Dark chocolates)లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రోగుల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది మెదడు, గుండెకు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో మెదడు పదును పెడుతుంది. ఇందులో పక్షవాతం నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. డార్క్ చాక్లెట్లలో కోకో కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది.
డార్క్ చాక్లెట్(Dark chocolates) సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చాక్లెట్ పిండం ఎదుగుదలను పెంచుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పిండానికి రక్త సరఫరా నిలిపివేయబడినప్పుడు లేదా నిరోధించబడినప్పుడు కొంతమంది తల్లులు ప్రీక్లాంప్సియాకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది అధిక రక్తపోటు వల్ల వస్తుంది, ఇది గర్భధారణ సమయంలో సహజంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో డార్క్ చాక్లెట్ ఉత్తమం.
ఈ చాక్లెట్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్తో పోరాడుతుంది. డార్క్ చాక్లెట్(Dark chocolates)లో ఖనిజాలు, విటమిన్లతో సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. డార్క్ చాక్లెట్ ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. డార్క్ చాక్లెట్ రెగ్యులర్ వినియోగం ఎర్ర రక్త కణాల పంపిణీని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.