కెజియఫ్ చాప్టర్2 తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్‌తో పాటే ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను కూడా నాన్‌స్టాప్‌గా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మధ్యే మారుతి సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఇప్పుడు మారుతి సినిమా నుంచి సలార్ సెట్స్‌కు షిఫ్ట్ అవనున్నాడు డార్లింగ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సలార్ తాజా షెడ్యూల్ ఈనెల 8వ తేది నుండి స్టార్ట్ కానుందనీ తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారట. విలన్‌గా నటిస్తున్న మళయాళ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ పై ఈ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. రేపో, మాపో మేకర్స్ షూటింగ్ అప్డేట్ ఇవ్వనున్నారట. అంతేకాదు సంక్రాంతి కానుకగా సలార్ నుంచి ఏదైన గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మరి షూటింగ్‌తో పాటు.. ఇంకేదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఇకపోతే.. కెజీయఫ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హోంబే ఫిల్మ్స్ వారు.. సలార్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్ పడలేదు. అందుకే సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరి సలార్ ఎలా ఉంటుందో చూడాలి.