• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Mahesh Babu : మ్యాన్లీ లుక్‌లో మహేష్ బాబు..రాజమౌళి సినిమా కోసమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో పలకరించారు. తన తదుపరి చిత్రం 'గుంటూరు కారం' త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. మహేష్ బాబు తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

June 9, 2023 / 10:08 PM IST

H Siddharth: ఆమెను చూడగానే సిద్దార్థ్ ఎందుకు ఏడ్చాడు!?

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా 'టక్కర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో.. ఒక పెద్దావిడను చూడగానే బోరున ఏడ్చేశాడు సిద్ధార్థ్. మరి ఆమె ఎవరు? ఈ హీరో ఎందుకు ఏడ్చాడు?

June 9, 2023 / 09:43 PM IST

Varun Tej-Lavanya Tripati: నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.

June 9, 2023 / 09:18 PM IST

Anchor Rashmi: షాకింగ్ వీడియో షేర్ చేసిన యాంకర్ రష్మీ

భారీ సంఖ్యలో తిమింగలాలను చంపుతున్న వీడియోను యాంకర్ రష్మీ షేర్ చేశారు. యానిమల్ లవర్ అయిన రష్మీ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు మనుషుల రూపంలోనే మనమధ్యే ఉంటారని ట్వీట్ చేశారు.

June 9, 2023 / 07:42 PM IST

Anasuya: డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయించారు.. ఇక విజయ్ దేవరకొండ జోలికి వెళ్లను: అనసూయ

టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్‌, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్‌గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్‌ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.

June 9, 2023 / 05:53 PM IST

‘Adipurush’ tickets: ‘ఆదిపురుష్’ టిక్కెట్లు ఫ్రీగా ఇస్తున్న రణబీర్.. రామ్ చరణ్ కూడా!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురుష్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆదిపురుష్‌ టికెట్స్ బుక్ చేస్తున్నట్టు సమాచారం.

June 9, 2023 / 05:44 PM IST

Vijayadevarakonda: మరోసారి ‘జనగణమన’ జోడీ.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా!?  

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.

June 9, 2023 / 04:30 PM IST

Adipurush: ‘ఆదిపురుష్’ షాకింగ్ రన్ టైం.. ఒక్క కట్ కూడా లేకుండా..!

జరిగితే జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జరగాలి.. లేదంటే ఆ రోజు పెద్ద గుణపాఠమే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌.. మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ లవర్స్ చూపు మొత్తం 'ఆదిపురుష్' మీదే ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకుంది.. కాకపోతే షాకింగ్ రన్‌ టైంతో రాబోతోంది ఆదిపురుష్‌.

June 9, 2023 / 03:32 PM IST

Kevvu Kartheek Wedding : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్..సెలబ్రిటీలు హాజరు

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీ పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

June 9, 2023 / 03:29 PM IST

Pawan kalyan: OG షూట్‌లో జాయిన్ అయిన పవర్ స్టార్!

అనుకున్న సమయానికి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పూర్తిగా పొలిటికల్‌గా బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(pawan kalyan). ప్రస్తుతం పవన్ చేతిలో హరిహరి వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, బ్రో, ఓజీ సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో పవన్‌ ఫస్ట్ ప్రయారటీ ఫిల్మ్ ఏదైనా ఉందా.. అంటే అది ఓజి(OG)నే అని చెప్పాలి.

June 9, 2023 / 02:25 PM IST

Veerabhadram chaudhary: నాగ్ తో సినిమా..నా కెరీర్ నాశనం అయింది!

దర్శకుడు వీరభద్రం చౌదరి(veerabhadram chaudhary) హీరో నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ డైరెక్టర్ నాగార్జునతో ‘భాయ్(bhai)’ అనే మూవీ తీశారు. తర్వాత అది 2013లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నాగ్ తన స్టోరీ మార్చారని ఇంకా పలు విషయాలను పేర్కొన్నారు.

June 9, 2023 / 03:27 PM IST

Nayanthara: పెళ్లి రోజు సర్ప్రైజ్..నయనతార పిల్లల ఫోటోలను చూశారా!

సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు.. ఇద్దరు కవల పిల్లలకు తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. ఇన్ని రోజులు చూసి చూపించనట్టుగా ఉన్న నయన్.. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

June 9, 2023 / 02:04 PM IST

Adipurush: మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్..డైరెక్టర్, హీరోయిన్ పై ఫిర్యాదు

ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

June 9, 2023 / 01:14 PM IST

Siddharth TAKKAR Movie Review: టక్కర్ ఫుల్ మూవీ రివ్యూ

హీరో సిద్దార్థ్ టక్కర్ మూవీ ఈ రోజు విడుదలైంది. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఏం చేశాడు..? హీరోయిన్‌తో ఎందుకు విడిపోయారనేదే కథ. మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది.

June 9, 2023 / 12:43 PM IST

Meenakshi Chaudhary: అడవి శేష్ హీరోయిన్ అందాల కనువిందు

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హాట్ ఫొటో షూట్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు త్వరలో మహేష్ బాబు సరసన కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన క్రేజీ చిత్రాలపై ఓ సారి లుక్కేయండి మరి.

June 9, 2023 / 11:38 AM IST