సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూస్తే.. అయ్యో అనిపించక మానదు. మిగతా హీరోలంతా షూటింగ్‌తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా మొదలు పెట్టడం లేదు. ఓ సినిమా రిలీజ్ అయిపోగానే.. మరో సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. ఇక తన కో స్టార్ రామ్ చరణ్ అయితే.. ఆర్సీ15 సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా అనౌన్స్ చేసేశాడు. కానీ మా హీరో మాత్రం ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం లేదు. అసలెందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు.. అది కూడా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్పప్పుడు.. అంటూ తెగ బాధపడిపోతున్నారు తారక్ ఫ్యాన్స్. కనీసం ఏదో ఒక అప్టేట్ అయినా ఇవ్వాలని మేకర్స్‌ని కోరుతున్నారు. కానీ వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎన్టీఆర్ కూడా ఎలాంటీ లీకులు ఇవ్వడం లేదు. దాంతో ఇప్పటికైనా తమ వేదనను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా షూటింగ్ మరింత లేట్ అవుతుందనే ప్రచారం ఒకటి టెన్షన్ పెడుతోంది. ఇదే కాదు ఇంకా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని వినిపిచింది. కానీ ఇప్పుడు హీరో, హీరోయిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. ఎన్టీఆర్‌తో దాదాపుగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందని అంటున్నారు. దాంతో ఫస్ట్ షెడ్యూల్లో రొమాంటిక్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. ఫిబ్రవరి ఎండింగ్ లేదా.. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా చిత్రీకరణ చేసి, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి లేట్‌గా స్టార్ట్ అయినా.. అనుకున్న సమయానికి ఎన్టీఆర్ 30 రిలీజ్ అవుతుందేమో చూడాలి.