గతంలో అలియా, రణ్‌బీర్ తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె 'ఎమర్జెన్సీ' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఎప్పుడూ ఏదోక హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ఆమె బాలీవుడ్ స్వీట్ కపుల్ అయిన అలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)పై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మరోసారి ఫైర్ అయ్యింది. అలియా, రణ్‌బీర్ ను ఉద్దేశించి ఇన్‌స్టాలో కంగనా ఓ పోస్ట్ షేర్ చేసింది.
ఇన్‌స్టాలో కంగనా(Kangana Ranaut) స్టోరీస్‌లో పలు విషయాలను రాసుకొచ్చింది. తాను ఎప్పుడైనా సినిమా ప్రకటించినప్పుడు తనతో పాటుగా సహానటులను కించపరిచేలా హెడ్‌లైన్స్ పెడుతున్నారని, అసహ్యమైన బల్క్ మెయిల్స్ పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పేపర్లలో ప్రతి ఒకే హెడ్లైన్ రావడం విడ్డూరంగా ఉందని, తనని చూసి బాధపడితే.. అలాంటి వారి కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పుకొచ్చింది. తనపై దుష్ప్రచారం చేస్తున్న చెంగుమంగు గ్యాంగ్‌కు అసూయ కలుగుతోందని నోట్ రాసింది.
మరో పోస్ట్‌లో పరోక్షంగా అలియా(Alia Bhatt), రణ్‌బీర్ (Ranbir Kapoor)పై రాసుకొచ్చింది. బాలీవుడ్లో ఓ జంట వేర్వేరు అంతస్తులలో నివశిస్తున్నారని, బయటికి మాత్రం కలిసి ఉన్నట్లుగా నటిస్తున్నారని తెలిపింది. మింత్రా బ్రాండ్‌ను తమ సొంతం అంటూనే తన సినిమా గురించి వారు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవలె అతను కుటుంబీకులతో లండన్ ట్రిప్ వెళ్తే, భార్య అలియా భట్, కుమార్తె రాహా ఇండియాలోనే ఉన్నారని, వాటి గురించి మాత్రం ఏ వార్తా పత్రికా రాయలేదని తెలిపింది.
సినిమా ప్రమోషన్స్, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుందని, అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదని, మాఫియా దాడి ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడని కంగనా రనౌత్(Kangana Ranaut) చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలంగా సినిమాల్లో అవకాశమిస్తానని అతను హామీ ఇచ్చాడని, ఇప్పుడు తను ఈ నకిలీ వివాహం నుంచి విముక్తి పొందాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడని కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది.