Garikapati narasimharao ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ ఆస్కార్‌కి నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఈ పాటపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటపై ఎందుకంత ఆసక్తి నెలకొందా?
Garikapati narasimharao ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ ఆస్కార్‌కి నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఈ పాటపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటపై ఎందుకంత ఆసక్తి నెలకొందా? అని తాను ఆ పాటను పెట్టించుకుని చూశానని ఆయన తెలిపారు. అచ్చ తెలుగు నాటు పదాలతో ఉన్న ఆ పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉందన్నారు. దాన్ని రాసిన చంద్రబోస్‌కి ముందుగా నమస్కారం అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి అచ్చ తెలుగు పాట ఆస్కార్‌కి నామినేట్ అవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మార్చి 13న దానికి తప్పకుండా ఆస్కార్ రావాలని తాను దేవుడికి ప్రార్థిస్తానని చెప్పుకొచ్చారు.
రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు చేసిన అద్భుత నటన, కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచనల కారణంగా ఇవాళ ఆ పాట అంత స్థాయికి చేరిందంటూ ప్రశంసించారు. నాటు నాటు పాటలో ఆ ఇద్దరు హీరోలు చేసిన డ్యాన్స్‌ని కూడా ఆయన మెచ్చుకున్నారు. అలా ఇద్దరూ ఒకేలా డ్యాన్స్ చేయడం కవలలై పుట్టిన వారికి కూడా సాధ్యం కాదని మెచ్చుకున్నారు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహా నటులు ఇద్దరూ అలాంటి నటన చేశారంటే తన కంటే చిన్న వాళ్లయినా వాళ్లకు నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు గరికపాటి.