‘Chamkila Angesi’ song of the year : సాంగ్ ఆఫ్ ది ఇయర్.. ‘దసరా’ ఫోక్ మెలోడి అదిరింది!
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై ఊహకందని హైప్ క్రియేట్ చేసింది. అలాగే ధూంధాం దోస్తానా, ఓరి వారి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. 'చమ్కీల అంగిలేసి.. ఓ వదినే' అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో మాత్రమే కాదు.. టాలీవుడ్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేలా ఉంది.
ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. దసరా సినిమాలో నాని మేకోవర్ ఊరమాస్‌గా ఉంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. నాని ధరణి పాత్రలో నటిస్తుండగా.. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. సింగరేణి నేపథ్యంలో.. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ సినిమా. అలాగే నాని చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే. మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై ఊహకందని హైప్ క్రియేట్ చేసింది. అలాగే ధూంధాం దోస్తానా, ఓరి వారి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘చమ్కీల అంగిలేసి.. ఓ వదినే’ అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో మాత్రమే కాదు.. టాలీవుడ్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేలా ఉంది. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాటను.. కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిర్యాల, DHEE పాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌తో దుమ్ములేపిన ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. సినిమాలో తెలంగాణ యాసలో నాని గురించి కీర్తిసురేశ్ పాడుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేస్తోంది. ఇక ఈ పాటలో వెన్నెలగా కీర్తి సురేశ్ మాసివ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మరి దసరాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.