ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. తాజాగా మరో బ్యూటీ కూడా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది.
Another young beauty final in 'Ustad Bhagatsingh'!
Ustad Bhagatsingh: ఉస్తాద్ భగత్ సింగ్‌ను గబ్బర్ సింగ్‌కు మించి తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌లో పవన్‌ను హై ఓల్టేజ్‌గా చూపించబోతున్నట్టుగా క్లియర్‌గా చెప్పేశాడు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు మరో బ్యూటీ కూడా నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో హీరోయిన్గా నటిస్తుందని వినిపించినప్పటికీ.. ఇప్పుడు సాక్షి వైద్య ఫైనల్ అయినట్టు తెలిసింది. అఖిల్ ‘ఏజెంట్’ మూవీతో హీరోయిన్గా పరిచయమైంది సాక్షి వైద్య.
ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు.. నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గాండివదారి అర్జున’ సినిమాలో నటిస్తోంది. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేశారా? అని అడగ్గా.. ‘ఇంకా లేదు. త్వరలోనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఉస్తాద్‌లో అమ్మడు ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతున్నట్టు ప్రచారంలో ఉంది. తేరిలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందుకే ఇప్పుడు ఉస్తాద్‌లో శ్రీలీలతోపాటు సాక్షి వైద్యను తీసుకున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్‌తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ ఫిల్మ్‌లోనూ సాక్షి వైద్య ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.