»Mangalavaaram Movie Producers Swathi Reddy Gunupati Suresh Varma Exclusive Interview
Mangalavaaram: సినిమాలో ఆ పాయింట్ చెప్పాలంటే.. గట్స్ ఉండాలి
మంగళవారం సినిమాను చూసి సెన్సార్ బోర్డ్ వాళ్లు చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన పాయల్ ఎంతో కీలకం, ఆమె చేసిన క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అనిపించింది. మంగళవారం సినిమా గురించి నిర్మాతలు ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Mangalavaaram: డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం(Mangalavaaram) స్టోరీ చెప్పినవెంటనే ఓకే చేశానని, ఈ సినిమాలో ఆ పాయింట్ చెప్పడం కచ్చితంగా అవసరం అనిపించిందని నిర్మాత స్వాతి రెడ్డి(Swathi Reddy Gunupati) తెలిపారు. చిత్రంలో పాయల్ రాజ్పుత్(Payal Rajput) ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని, ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని పేర్కొన్నారు. షూటింగ్కు ముందు చాలా రిసెర్చ్ చేశారని, అందుకే ఇంత ఫర్ఫెక్ట్గా తీయగలిగామని ప్రొడ్యూసర్ సురేష్ వర్మ వెల్లడించారు. ప్రతీ క్యారెక్టర్ అద్భుతంగా నటించారని దీన్ని కచ్చితంగా థియేటర్లోనే చూడాలని, సినిమా అసలు ఎందుకు ఓకే చేశారో, చిత్రాన్ని చూసిన సెన్సార్ వాళ్లు ఏం అన్నారో చెప్పారు. మంగళవారం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.