నేటి (september 18th 2023 ) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.
మేషం
ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దైవబలంతో కీలక వ్యవహారాలు పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. మానసికంగా దృఢంగా ఉంటారు.బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు.
మిథునం
బంధువులతో మిత్రులతో అనుకూలత ఉంటుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
కర్కాటకం
కీలక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందాతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి.కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.
కన్య
బంధు, మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. తొందరపాటుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
తుల
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు లభిస్తాయి.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు.విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.
వృశ్చికం
శుభ కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
ధనుస్సు
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకులమైన వాతావరణం ఉంటుంది.
పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.
మకరం
కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
కుంభం
కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
మనోబలంతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నాలు కలుగకుండా చూసుకోవాలి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు.
చదవండి : Rain Alert: ఏపీకి అలర్ట్.. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
ఈరోజు (september 24th 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.