Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి:రుణప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం కలిగే అవకాశం ఉంది. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి:శుభకార్య ప్రయత్నాలు ఈజీ అవుతాయి. దూర బంధువులతో కలువడం వల్ల లాభం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు నెరవేరతాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు.
మిథున రాశి:ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు.
కర్కాటక రాశి:మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహ రాశి:ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కన్య రాశి:బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
చదవండి: Tirumala : మే14 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
తుల రాశి:ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి:కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధనవ్యయం తప్పదు.
ధనుస్సు రాశి:కుటుంబంలో చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. పరిస్థితిని అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తతంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
మకర రాశి:బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
కుంభ రాశి:స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
మీన రాశి: వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.