ఈరోజు మీరు చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ఆర్థిక అంశాలు మెరుగుపడతాయి. గతంలో పూర్తికాని కొన్ని పనులు పూర్తి అయ్యే దిశగా సాగుతాయి. పని భారం పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించని మాటలను పట్టించుకోకండి. గణపతి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది.
వృషభం:
మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అస్థిర బుద్ధి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల సలహాలు ఈ రోజ మీకు కలిసొస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో చంద్రుడు వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తున్నారు. చంద్ర ధ్యానం శుభదాయకం.
మిథునం:
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనులను ముందుగా పూర్తి అయ్యేటట్లు కార్యరచన చేయాలి. మిత్రుల సహకారం అందుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కనకదుర్గాదేవి నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం:
ఈ రోజు ఆహ్లాదకరమైన కాలాన్ని గడుపుతారు. మీ మీ రంగాల్లో తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చుట్టు ఉన్నవారు సాయం చేస్తారు. ఋణ సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి. లక్ష్మీ గణపతి దర్శనం మంచిది.
సింహం:
అసమానమైన క్రమశిక్షణతో లక్ష్యాలకు చేరువవుతారు. మనస్సాక్షికి వ్యతిరేకంగా వ్యవహరించకండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువనిస్తే ఇబ్బందులు దరి చేరవు. ద్వితీయంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనిభారం వల్ల అలసటగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. దుర్గా దర్శనం ఉత్తమం.
కన్య:
మీ లక్ష్యం దిశగా ఈరోజు అడుగలు వేయండి అంతా శుభమే జరుగుతుంది. ఇదే సరైన సమయం ఇష్టులతో ఆనందంగా గడుపుతారు. మీ మీ రంగాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. మంచి పేరును సంపాదిస్తారు. ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది.
తుల:
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ శక్తి సామర్థ్యం దృష్టిలో ఉంచి ముందుకు వెళ్లడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యయస్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు చేయాలి. శ్రీరామ నామం జపించండి.
వృశ్చికం:
కార్యరంగంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంపూర్ణ మనోబలంతో వాటిని ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తోటి వారి సలహాలు తీసుకోవడం మంచిది. సాహసోపేతం అయిన చర్యలు చేయరాదు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఈశ్వర ధ్యానం శుభదాయకం.
ధనుస్సు:
సామాజిక స్పృహతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకున్నది సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగినంత పని చేయాలి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కీలక సమస్యలను మీ బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. అనవసర ధనవ్యయం సూచితం. ఆంజనేయ దండకం చదివితే మంచిది.
మకరం:
అకుంటిత దీక్షతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు బాగా పనిచేస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. నవమంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం లేదు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.
కుంభ రాశి:
మొదలుపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. సాకారాత్మక ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఇబ్బందులు దూరం అవుతాయి. అవసరానికి ఆదుకునే వారు ఉంటారు. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయోదాయకం.
మీనం:
ఈ రోజు మీ కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. మీ మీ రంగాల్లో మంచి గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక అంశాలు మెరుగుపడతాయి. ఈ రోజు ఒక శుభవార్త వింటారు. శత్రువులపై మీదే పై చేయి అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకు నమస్కరించండి.