మేషం
మీ వ్యక్తిగత జీవితంలో విజయానికి చేరువలో ఉంటారు. ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు వేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది చాలా మంచి సమయం. వైవాహిక జీవితం బావుంటుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.
వృషభం
మీరు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.రుణ చెల్లింపుల కోసం కొంత నగదును చేతిలో ఉంచుకోండి. విశ్రాంతి అవసరం అవుతుంది. ఉన్నంతలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కోపం తగ్గించుకోవాలి.మీకుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.
మిథునం
ఉద్యోగం, వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. సందర్భానికి తగినట్టు మిమ్మల్ని మీరు మలుచుకుంటే మంచిది. కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు, అభినందనలు దక్కుతాయి. మీ సన్నిహిత వ్యక్తుల నుంచి మీకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
కర్కాటకం
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కృషి ఫలిస్తుంది..అదృష్టం కలిసొస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వివిధ వనరుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కోపం తగ్గించుకోవాలి.
సింహం
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైనవారితో బలమైన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు.
కన్య
మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
తుల
మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయగలుగుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు
వృశ్చికం
ఈ రాశివారు వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. బంధాలను పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు
నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.ఆర్థిక స్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యానికి సంబంధించిన కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి
మకరం
ఈ రాశివారికి తొటి ఉద్యోగులు నుంచి సహకారం లభిస్తుంది. ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం , ఆదాయం స్థిరంగా ఉంటుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి.
కుంభం
మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆర్థికంగా అబివృద్ధి చెందుతారు. వృత్తి పరంగా కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పనులు వాయిదా వేయడం వల్ల నష్టపోతారు. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు.
మీనం
మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రేమపూర్వక సంబంధాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వృత్తి పరంగా సవాళ్లు ఎదురవుతాయి కానీ మీ కృషితో విజయం అందుకుంటారు.ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
చదవండి : కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విజయ శాంతి