»Horoscope Today Todays Horoscope December 2nd 2023 Sudden Money Gain
Horoscope Today : నేటి రాశిఫలాలు(December 2nd 2023)..ఆకస్మిక ధనలాభం
ఈ రోజు(December 2nd 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈరాశివారికి నేడు వృత్తి , ఉద్యోగాలలో పలుకుబడి, గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రయత్నాలు చేపడుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. కుటుంబంలో చికాకు ఉంటుంది. ఆదాయం పర్వాలేదు.
వృషభం:
ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ జీవితం బావుంటుంది. అధికారుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సాఫీగా సాగవు. ఆరోగ్యం బావుంటుంది.
మిథునం:
ఈ రాశివారికి అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బాకీలు, బకాయిలు వసూలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పర్వాలేదు. కుటుంబ జీవితం బావుంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి.
కర్కాటకం:
ఈ రాశివారికి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. బంధువులకు అండగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. విద్యార్థులకు కష్టాలు తలెత్తుతాయి.
సింహం:
ఈ రాశి వారికి ఉద్యోగంలో పనిభారం ప్రారంభమవుతుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడుతారు. వ్యక్తిగత సమస్యలు తీరుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పర్వాలేదు.
కన్య:
ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉద్యోగాల్లో భారం పెరుగుతుంది. వ్యాపారాలు బావుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మిత్రుల వల్ల నష్టాలను చూస్తారు. ఒత్తిడి ఉంటుంది.
తుల:
ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ జీవితం బావుంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృశ్చికం:
ఈ రాశివారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. సతీమణి సహకారం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పర్వాలేదు.
ధనుస్సు:
ఈ రాశివారికి వ్యక్తిగత సమస్య వేధిస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. మిత్రులకు సాయం చేస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉంటే బావుంటుంది. వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
మకరం:
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీరుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. సంతానం యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. కోపాలు తగ్గించుకుంటే చాలా మంచిది. అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
కుంభం:
ఈ రాశివారికి ఎటువంటి ఇబ్బందులు రావు. దేవాలయాలను సందర్శిస్తారు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. తల్లిదండ్రులకు సహకారం అందిస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులకు దూరంగా ఉంటే మంచిది.
మీనం:
ఈ రాశివారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆదాయం బావుంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి. కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యానికి గురవుతారు. ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఒత్తిడి ఉంటుంది. దూర ప్రయాణాలు చేపడతారు.